వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో పాత్రికేయులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాత్రికేయులు సాంఘికంగా, ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వాలు, సమాజంలోని అన్ని వర్గాలవారు సహకరించాలని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తెలిపారు. వివిధ మీడియా సంస్ధలు, పత్రికలకు చెందిన పలువురు పాత్రికేయులకు ప్రతిభా పురస్కారాలతోపాటు, వారి పిల్లలకు విద్యా ప్రోత్సాహకాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు, వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, దుర్గారావు, పురస్కారాల కమిటీ చైర్మన్ నాగరాజు పట్నాయక్ పాల్గొన్నారు.
వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో.. పాత్రికేయులకు ప్రతిభా పురస్కారాలు - Vizag Journalists Forum latest news update
విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో పాత్రికేయులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పాత్రికేయులకు ప్రతిభా పురస్కారాలు