విశాఖ జిల్లా అనకాపల్లిలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుచ్చయ్య గూడేనికి చెందిన రాజ వరపు లెనిన్ బాబు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లెనిన్‌బాబు రాంబిల్లిలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య తొమ్మిది నెలల గర్భవతి. ఆమె పుట్టింటికి వెళ్లడంతో లెనిన్ బాబు తన స్నేహితుడు రవి ఇంట్లో పడుకున్నాడు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - anakapalli crime news
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విశాఖ జిల్లా అనకాపల్లిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఏమైందో తెలియదు.. రవి వెళ్లి చూసేసరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతణ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి:40 కిలోల గంజాయి పట్టివేత... ముగ్గురు అరెస్టు