విశాఖ జిల్లా గంగవరం గ్రామంలోని టైలర్లు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయం 10 వేల రూపాయలు అందలేదని తెలిపారు. ఇందేంటా అని అడిగితే స్థానిక పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇతర అవసరాలు తీర్చుకుంటున్నారు అని ఆరోపించారు.
ఈ విషయమై నాతవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన పలువురు టైలర్లు నర్సీపట్నం ఆర్డీవోకు వారు వినతి పత్రం అందజేశారు. ఒక్కో దరఖాస్తుకు రెండు వేల రూపాయలు, ఒక నాటుకోడి డిమాండ్ చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఆర్డీవో లక్ష్మి.. విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.