శ్రీకాకుళం జిల్లాలో గుళ్ల సీతారామపురంలోని ఆలయ దుస్థితిని చూసి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ఆవేదన చెందారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా.. ఈ ప్రాంతాన్ని చేరుకున్న స్వాత్మానందేంద్ర స్వామి దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఆలయానికి మూడు వేల ఎకరాలున్నా నిర్లక్ష్యానికి గురి కావడం బాధాకరం. ఈ భూముల్ని అన్యాక్రాంతం చేసిన వారికి నాశనం తప్పదు. ఆక్రమించుకున్న భూముల్ని అలయానికి తిరిగి అప్పగించాలి. ఈ దేవాలయ దుస్థితిపై దేవాదాయ శాఖతో చర్చిస్తాము. శ్రీరామనవమి వేడుకలకు విశాఖ శారదాపీఠం తరపున పట్టువస్త్రాలను పంపుతాం. అలాగే సీతారాములకు వెండి కిరీటాలను చేయిస్తాము.