రాష్ట్రంలో ఇటీవల దేవాలయాలపై చోటుచేసుకున్న పరిణామాలపై దేవాదాయ శాఖ తరుఫున పీఠాధిపతులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని... శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గోనేందుకు వచ్చిన సీఎం వద్ద పలు కీలక అంశాలను ప్రస్తావించారు. హిందూ ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. వారసత్వ అర్చకత్వం పూర్తిస్థాయిలో అమలు కావడంలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు పీఠం వర్గాలు వెల్లడించాయి.
'హిందూ ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలి' - శారదాపీఠాధిపతి వార్తలు
రాష్ట్రంలో హిందూ ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను స్వరూపానందేంద్ర సరస్వతి కోరారు. ఇటీవల దేవాలయాలపై జరిగిన పరిణామాలపై దేవాదాయ శాఖ తరఫున పీఠాధిపతులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
!['హిందూ ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలి' swaroopanandendra saraswati requsted cm Jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10669044-64-10669044-1613578341298.jpg)
'హిందూ ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలి'