ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైష్ణవీ దేవి అవతారంలో రాజశ్యామల అమ్మవారి దర్శనం - విశాఖలోని శారదాపీఠంలో శరన్నవరాత్రులు

శారదా పీఠంలోని రాజశ్యామల అమ్మవారు, వైష్ణవీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. శంఖ, చక్ర, గధ సారంగములను చేతపట్టి... గరుడ వాహనంపై ఆశీనులై అమ్మవారు భక్తులను అనుగ్రహించారు.

Swaroopa Rajasyamala Ammavaru
వైష్ణవీ దేవి అవతారం రాజశ్యామల అమ్మవారు

By

Published : Oct 19, 2020, 3:13 PM IST

విశాఖలోని శారదాపీఠంలో స్వరూప రాజశ్యామల అమ్మవారు సోమవారం వైష్ణవీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శంఖు, చక్ర, గదా సారంగములను చేతపట్టి... గరుడ వాహనంపై ఆసీనులై అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. ఆలయ పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

అనంతరం అమ్మవారి పాదాల చెంత ప్రతిష్టించిన శ్రీచక్రానికి నవావరణ అర్చన నిర్వహించారు. లోక కల్యాణార్థం విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన చండీయాగం కొనసాగుతోంది. అలాగే శ్రీమత్ దేవీ భాగవత పారాయణ మహాయజ్ఞాన్ని కూడా నిర్వహిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details