ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SWARN VIJAY VARSH CELEBRATIONS: రక్షణ దళాల సాహసానికి ప్రతీకే.. స్వర్ణ విజయ్‌ వర్ష్‌ ఉత్సవం!

ఐదు దశాబ్దాల క్రితం భారత్-పాక్ యుద్ధంలో విజయానికి ప్రతీకగా.. విశాఖ జిల్లాలో ఘనంగా స్వర్ణ విజయ్ వర్ష్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

By

Published : Sep 3, 2021, 10:45 AM IST

swarna-vijay-varsh-festival-in-visakhapatnam
రక్షణ దళాల సాహసానికి ప్రతీకే.. స్వర్ణ విజయ్‌ వర్ష్‌ ఉత్సవం!

విశాఖ జిల్లాలో ఘనంగా స్వర్ణ విజయ్ వర్ష్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐదు దశాబ్దాల క్రితం భారత్-పాక్ యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఈ ఉత్సవాన్ని జరిపిస్తున్నారు. పోర్టుబ్లెయిర్‌లోని ఐఎన్‌ఎస్‌ సుమిత్ర నుంచి బయల్దేరిన విజయ జ్యోతి... విశాఖ తూర్పు నౌకాదళానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళ ప్రధానాధికారి, హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు.

ప్రస్తుతం బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ స్మారక స్తూపం వద్ద విజయ జ్యోతిని.. వైస్ అడ్మిరల్ ఎ.బి.సింగ్, సుచరిత ఉంచారు. అందుకోనున్నారు. 1971లో పాక్‌పై జరిగిన యుద్ధంలో పాల్గొన్న విశ్రాంత నౌకాదళ అధికారులు కూడా ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు. అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుని అతిథులంతా నివాళులర్పిస్తున్నారు. నేవీ అధికారులు విశాఖలోని పాఠశాలలకు కూడా విజయ జ్యోతిని తీసుకెళ్లి... కిశోర బాలబాలికల్లో ఆనాటి విజయ స్ఫూర్తిని అవగాహన కల్పించనున్నారు.

ఇదీ చూడండి:Fire accident: వీరపనేనిగూడెంలోని ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details