ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

7 న 'మనో' కు స్వర చక్రవర్తి బిరుదు ప్రదానం - 'స్వర చక్రవర్తి'

ఈ నెల 7వ తేదీన  విశాఖలో సినీ నేపథ్య గాయకుడు మనోకి 'స్వరచక్రవర్తి'  సంగీత పురస్కార ప్రదానం జరగనుంది. వీ-టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి... 12 మంది గాయనీ గాయకులతో పాటు.. విలేజ్ సింగర్ బేబీ హజరుకానున్నారు.

విశాఖలో 'స్వర చక్రవర్తి' జాతీయ సంగీత పురస్కార వివరాలను వెల్లడిస్తున్న నిర్వహకులు

By

Published : Sep 6, 2019, 7:18 PM IST

విశాఖలో 'స్వర చక్రవర్తి' జాతీయ సంగీత పురస్కార వివరాలను వెల్లడిస్తున్న నిర్వహకులు

సినీ నేపథ్య గాయకునిగా 17 వేల గీతాలు ఆలపించిన మనో (నాగూర్ బాబు)కు... ఈనెల 7వ తేదీన విశాఖలో 'స్వర చక్రవర్తి' జాతీయ సంగీత పురస్కార ప్రదానం జరగనుంది. విశాఖ 'వీ టీమ్' ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి... ముఖ్య అతిథిగా పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ హజరుకానున్నారు. 12 మంది గాయనీ గాయకులతో పాటు'విలేజ్ సింగర్' ఫేమ్ గాయని బేబీ పాల్గొననున్నారు. అలనాటి సినీ విశేషాలను గుర్తు చేసే విధంగా ప్రత్యేక షో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు వీరూ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details