ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పీవీ శతజయంతి వేడుకలతో తెలంగాణ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు' - పీవీ శతజయంతి వేడుకలు

పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు నిర్వహించడం ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని.. విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానంద అన్నారు. ఈ నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. పీవీ గొప్ప ఆర్థికవేత్త మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక వేత్త అని పేర్కొన్నారు.

swamy swarupa nanda about pv narasimha rao birth anniversary celebrations
పీవీ నరసింహారావుతో స్వామి స్వరూపానంద

By

Published : Jun 29, 2020, 10:02 AM IST

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ శతజయంతి వేడుకలను పెద్దఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్‌ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని కొనియాడారు.

పీవీకి విశాఖ శారదాపీఠం అంటే ఎంతో మక్కువని.. ఆ గౌరవంతోనే గతంలో సందర్శించారని స్వరూపానంద తెలిపారు. పీవీ సొంతూరు వంగర శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ తన చేతుల మీదుగా చేయించారని గుర్తుచేసుకున్నారు. ఆయన గొప్ప ఆర్ధికవేత్త మాత్రమే కాదు, ఆధ్యాత్మిక వేత్త అని స్వామి చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details