ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిత్రలేఖనం పోటీలు - swami vivekananda jayanthi news in visakhapatnam

హిందూమతం గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసిన 'స్వామి వివేకానంద' జయంతిని పురస్కరించుకొని... విశాఖలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. నేటి నుంచి 18 రోజుల పాటు స్వామి వివేకానంద జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/29-December-2019/5530350_vivekananda.mp4
విశాఖలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిత్రలేఖనం పోటీలు

By

Published : Dec 29, 2019, 5:52 PM IST

విశాఖలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిత్రలేఖనం పోటీలు

'స్వామి వివేకానంద' జయంతిని పురస్కరించుకొని విశాఖలో చిత్రలేఖనం పోటీలు జరిగాయి. వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా విద్యార్థులు చిత్రాలు వేశారు. నేటి నుంచి 18 రోజుల పాటు 'స్వామి వివేకానంద' జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు వచ్చే నెల 5న బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details