విశాఖ నగరం చెత్త సమస్యకు పరిష్కారం చూపిస్తోంది. వ్యర్థాల నిర్వహణ దిశగా అత్యుత్తమ మార్గాలను అనుసరించనుంది. బయో మైనింగ్ వంటి వినూత్న ప్రాజెక్టును అందిపుచ్చుకుని దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపిస్తోంది. మ్యాన్ హోల్ టు మిషన్ హోల్ ఆలోచనను అమలులోకి తీసుకువచ్చి పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు పెద్ద పీట వేసింది. ఇలా అనేక వైవిధ్యమైన ప్రాజెక్టులతో సాగర నగరి స్వచ్ఛసర్వేక్షణ్‌లో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. ఆ దిశగా స్వచ్ఛతా యాప్ డౌన్లోడ్స్ విషయంలో విశాఖ ప్రజలు చూపిస్తున్న చొరవ ఈ ఏడాది స్వచ్ఛ ర్యాంకుల్లో ఉత్తమ స్థానం కైవసం చేసుకుంటామనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఈ అంశంపై మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్. జి. సృజనతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో సత్తా చాటేలా... విశాఖలో చర్యలు : సృజన - latest news in visakha
విశాఖ నగరంలో చెత్త నిర్వహణ కోసం అధికారులు అత్యుత్తమ మార్గాలను అనుసరిస్తున్నారు. బయోమైనింగ్ లాంటి వినూత్న ప్రాజెక్టుల ద్వారా దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. అనేక వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాంకుల్లో సత్తా చేటేలా....నగరాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది స్వచ్ఛ ర్యాంకుల్లో ఉత్తమ స్థానం కైవశం చేసుకుంటామంటున్న జీవీఎంసీ కమిషనర్ సృజనతో....ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
జీవీఎంసీ కమిషనర్ సృజనతో ముఖాముఖి