విశాఖపట్నం జిల్లా మరికల్వసలోని పీపీ2 కాలనీలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరుకు చెందిన వడ్లమాని వెంకటేశ్వర్లు, విరమనికి 2015లో వివాహం జరిగింది. విరమని భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. మధురవాడ మరికల్వసలోని అద్దె ఇంట్లో నాలుగు నెలలుగా నివాసం ఉంటున్నారు. భార్యభర్తలు ఇద్దరూ తరచూ గొడవ పడుతుండేవారు. శనివారం విరమని ఇంట్లో మృతి చెంది ఉంది. ఆమె ఒంటిపై గాయాలున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మహిళ అనుమానాస్పద మృతి - ఈటీవీ భారత్ తాజా వార్తలు
విశాఖపట్నం జిల్లా మరికల్వసలో మహిళ అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. భర్తే ఆమెను హత్య చేసుంటాడనే కోణంలో పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ అనుమానాస్పద మృతి