ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద మృతి - Anakapalli latest news

గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Suspicious death of unidentified woman in Anakapalli
Suspicious death of unidentified woman in Anakapalli

By

Published : May 12, 2021, 8:35 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని కొప్పాక వంతెన వద్ద గుర్తుతెలియని మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది.

వివరాల్లోకి వెళితే...

అనకాపల్లి కొప్పాక వంతెన వద్ద 45 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళ మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. విషయాన్ని పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి అనకాపల్లి పట్టణ సీఐ భాస్కరరావు, ఎస్ఐ రామకృష్ణ చేరుకొని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియ రాలేదని.... అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. క్లూస్ టీమ్ పోలీసులు వచ్చి వేలిముద్రలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.

ఇదీ చదవండి:క్రేన్​లో 350 కేజీల గంజాయి తరలింపు... ఇద్దరి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details