విశాఖ మన్యం లబ్బూరు పీహెచ్సీ పరిధిలోని సంగడ సబ్ సెంటర్ ఆరోగ్య సహాయకుడు చిన సత్యనారాయణ.. నెల రోజులుగా విధులకు హాజరు కావటం లేదని వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు. పాడేరు ఐటీడీఏ పీవో డి.కె బాలాజీ.. స్పందించారు. సత్యనారాయణను సస్పెండ్ చేశారు. గతనెల 14 నుంచి విధులకు హాజరు కానట్టుగా గుర్తించారు. కరోనా సమస్య ఉన్న తరుణంలో.. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు.
విధులకు డుమ్మా.. ఆరోగ్య సహాయకుడు సస్పెండ్ - vishaka district
విశాఖ జిల్లా మన్యం మారుమూల ప్రాంతంలో విధులకు డుమ్మా కొడుతున్న ఆరోగ్య సిబ్బందిని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సస్పెండ్ చేశారు.
![విధులకు డుమ్మా.. ఆరోగ్య సహాయకుడు సస్పెండ్ vishaka district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6890259-602-6890259-1587528924996.jpg)
విధులకు డుమ్మా కొడుతున్న ఆరోగ్య సహాయకుడు సస్పెండ్