ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపా నాయకుడి బైక్ దగ్ధం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు - భాజపా నాయకులు బైక్ దగ్ధం వార్తలు

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీకి చెందిన భాజాపా జిల్లా కార్యవర్గ సభ్యుడి ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. అధికార పార్టీ నాయకుల అక్రమాలను బయటపెట్టేందుకు యత్నించడంతోనే ఇలా చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

suspected persons fired a bike of bjp member in visakhapatnam
suspected persons fired a bike of bjp member in visakhapatnam

By

Published : Jul 1, 2020, 5:38 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన భాజపా జిల్లా కార్యవర్గ సభ్యుడు కే సూర్యనారాయణ రాజు ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. పథకం ప్రకారం పెట్రోల్ పోసి నిప్పుపెట్టారని స్థానికులు భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో తాను అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశానని, ఈ క్రమంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సూర్యనారయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి :కుయ్.. కుయ్.. శబ్ధాలతో మార్మోగిన విజయవాడ

ABOUT THE AUTHOR

...view details