విశాఖ సింహాచలం అప్పన్న ఆలయ నూతన ఈవోగా సూర్యకళ బాధ్యతలు స్వీకరించారు. సూర్యకళ ముందుగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దస్త్రంపై తొలి సంతకం చేశారు. సింహాచల దేవస్థానంలో.. 16 నెలలుగా నలుగురు ఈవోలు బదిలీ అయ్యారు. ఎస్డీసీగా పని చేస్తున్న సూర్యకళను.. ప్రభుత్వం ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సింహాద్రి అప్పన్న ఆలయ నూతన ఈవోగా సూర్యకళ బాధ్యతల స్వీకరణ - సింహాద్రి అప్పన్న వార్తలు
విశాఖ సింహాచలం అప్పన్న ఆలయంలో.. నూతన ఈవోగా సూర్యకళ బాధ్యతలు స్వీకరించారు. ఎస్డీసీగా పని చేస్తున్న సూర్యకళ.. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.
సింహాద్రి అప్పన్న ఆలయ నూతన ఈవోగా సూర్యకళ బాధ్యతల స్వీకరణ