ఈ నెల 16న విశాఖలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నిర్వహించిన సమీక్షలో మాన్సాస్‌కు చెందిన అన్ని అంశాలపై విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో మాన్సాస్‌పై దేవాదాయశాఖ అధికారులు దృష్టిపెట్టారు. ట్రస్ట్ పరిపాలను గాడిలో పెట్టేందుకని పేర్కొంటూ వివిధ అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు పలువురు అధికారులకు బాధ్యతలు ఇచ్చారు.
వీరిలో దేవాదాయశాఖ అదనపు కమిషనర్ టి.చంద్రకుమార్, విజయనగరం సహాయ కమిషనర్ వినోద్‌కుమార్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్‌జేసీ) ఎంవీ సురేష్‌బాబు, కాకినాడ ఉప కమిషనర్ ఎం.విజయరాజు, మాన్సాస్ ట్రస్టు ఈవో, దేవాదాయశాఖ కమిషనరేట్‌లోని న్యాయ సలహాదారు కె.సూర్యారావు ఉన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారామపురంలోని సీతారామస్వామి ఆలయ భూములను, ఆభరణాలు, స్థిర, చర ఆస్తులను దుర్గగుడి ఈవో భ్రమరాంబ, రాజమహేంద్రవరం ఆర్జేసీ సురేష్‌బాబు పరిశీలించనున్నారు.
ఆరోపణలు ఉన్నా.. బాధ్యతలు