ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్టు ప్రభావిత​ ప్రాంతాల్లో డ్రోన్ గస్తీ..! - విశాఖ మన్యం తాజా వార్తలు

విశాఖ పాడేరు ఏజెన్సీలో డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టులు గెరిల్లా వారోత్సవాలు ప్రకటించారు. పోలీసులు జి.మాడుగుల, పెదబయలు సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రోన్ల సాయంతో కొండ ప్రాంతాలు పరిశీలిస్తున్నారు.

విశాఖ మావోయిస్ట్​ ప్రాంతాల్లో పెరిగిన గస్తీ
విశాఖ మావోయిస్ట్​ ప్రాంతాల్లో పెరిగిన గస్తీ

By

Published : Dec 3, 2019, 11:48 PM IST

మావోయిస్టు ప్రభావిత​ ప్రాంతాల్లో డ్రోన్ గస్తీ..!

విశాఖ మన్యంలో మావోయిస్టులు గెరిల్లా వారోత్సవాలు ప్రకటించారు. జి.మాడుగుల పెదబయలు సరిహద్దు గ్రామాల్లో ఆదివారం పోస్టర్లు అతికించారు. వారోత్సవాలు విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టుల దాడులను తిప్పి కొట్టేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. మారుమూల ప్రాంతాల్లో సాంకేతికతను వినియోగించుకుంటూ తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి కొండ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details