విశాఖపట్నం.. గూడెం కొత్తవీది మండలానికి చెందిన నలుగురు మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు జీకేవీధి సీఐ అశోక్‌కుమార్ ముందు గురువారం లొంగిపోయారు. సీఐ అశోక్‌కుమార్ మాట్లాడుతూ అమ్మవారిధారకొండ పంచాయతీ పెబ్బంపల్లి గ్రామానికి చెందిన కె.వెంకటరావు, ముర్ల లక్ష్మయ్య, ముర్ల రామారావు, కొర్రా మత్స్యరాజులు కొంతకాలంగా మావోయిస్టు మిలీషియా సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేతలు అరుణ, ఉదయ్, కాకూరి పండన్న అలియాస్ జగన్‌తో బాటు మరికొంత మంది తమ గ్రామాలకు వచ్చినప్పుడు వారికి భోజనం, వసతి కల్పించడంతో బాటు పోలీసుల సమాచారం అందించేవారు.
దీనికి తోడు మావోయిస్టులు నిర్వహించే సమావేశాలకు ప్రజలను పిలవడం, మీటింగులు ఏర్పాటు చేయడం, మావోయిస్టులు నిద్రించే సమయంలో రక్షణగా ఉండేవారు.