విశాఖ జిల్లా అనకాపల్లి అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు బాలింతలకు ఇవ్వడంపై పలువురు నిరసనలు తెలిపారు. అనకాపల్లి పట్టణం ధోబీ కాలనీలోని 2 అంగన్వాడీ కేంద్రాల్లో... బాలింతలు, గర్భిణులకు కుళ్లిన కోడిగుడ్లు ఇచ్చారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి సరఫరా చేయడం వల్ల తమ ఆరోగ్యాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
గర్భిణులు, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు ఇవ్వటమేంటి? - విశాఖఫట్నం జిల్లా తాజా వార్తలు
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఎంత ముఖ్యమో మనకి తెలియనిది కాదు. వారికోసం ప్రభుత్వాలు... పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా సప్లై చేస్తున్నాయి. కానీ అందులో కుళ్లిన కోడిగుడ్లు దర్శనమిస్తున్నాయి. అనకాప్లలిలోని కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
అనకాపల్లి అంగన్వాడీలో గర్భిణీలు, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా
ఈ విషయమై అంగన్వాడీ కార్యకర్తని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోతున్నారు. ఘటనపై ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు అధికారి మేరీ సువార్తను వివరణ కోరగా... లాక్డౌన్ సమయంలో వచ్చిన కోడిగుడ్లలో కొన్ని పాడైపోయినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని వెంటనే మార్చి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై చర్చ..తొలివిడతో 256 సర్వీసులు