ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గోవాడ చక్కెర కర్మాగారంలో గానుగ ఆటకు శ్రీకారం

విశాఖ జిల్లాలో గోవాడ చక్కెర కర్మాగారం గానుగ ఆటకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి అస్టిస్టెంట్ కేన్ కమిషనర్ జీవీవీ.సత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

By

Published : Dec 6, 2019, 7:58 PM IST

Published : Dec 6, 2019, 7:58 PM IST

suger press started in Govada Sugar Factory  at visakha
చెరుకు గడలను గానుగలోకి వేస్తున్న అధికారులు

విశాఖ జిల్లాలో సహకార రంగంలో ఉన్న మూడు చక్కెర కర్మాగారాలు 2019-2020 గానగ ఆటను ప్రారంభించనున్నాయి. ఇందులో భాగంగా గోవాడ చక్కెర కర్మాగారం గానుగ ఆటను ఆసిస్టెంట్ కేన్ కమిషనర్ జీవీవీ.సత్యనారాయణ ప్రారంభించారు. ఎండీ సన్యాశినాయుడుతో కలిసి కమిషనర్ సత్యనారాయణ కేన్ క్యారియర్లో చెరకు గడలను వేశారు. గోవాడ షుగర్స్ 4.5 లక్షల టన్నులు, ఏటికొప్పాక షుగర్స్ 80 వేల టన్నులు, తాండవ షుగర్స్ 90 వేల టన్నుల చెరకును ఈ ఏడాది గానుగ ఆట చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు సత్యనారాయణ తెలిపారు. మిగిలిన మూడు ఫ్యాక్టరీలు ఈ నెలాఖరు నాటికి గానుగ ఆటను మొదలుపెట్టనున్నాయి.

గోవాడ చక్కెర కర్మాగారంలో గానుగ ఆటకు శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details