విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఫకీరుసాహేబ్ పేట, రావికమతం చెరకు తూనిక కేంద్రాల వద్ద వైసీపీ అధ్వర్యంలో చెరుకు రైతులు ఎమ్మెల్యే చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. గోవాడ చక్కెర కర్మాగారంకు 2019-20లో చెరకు సరఫరా చేసిన రైతులకు నేటి వరకు యజమాన్యం నగదు చెల్లింపులు చేయలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ సీఎం జగన్ తో చెరకు రైతుల ఆర్థిక ఇబ్బందులను వివరించి.. రూ.22.12 కోట్లు కర్మాగారంనకు వచ్చేలా కృషి చేశారని రైతులు అన్నారు.
'బకాయిలు చెల్లించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు' - విశాఖ జిల్లా చోడవరం
విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో చెరకు తూనిక కేంద్రాల వద్ద చెరుకు రైతులు ఎమ్మెల్యే ధర్మశ్రీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. తమ బకాయిలను ప్రభుత్వం చెల్లించి ఆర్ధీకంగా అదుకున్నారని రైతులు వ్యాఖ్యనించారు.
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చెరుకు రైతులు