ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గోవాడ చక్కెర కర్మాగారంలో ముగిసిన గానుగాటకాలం

విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో 3.75 లక్షల టన్నుల చెరుకును గానుగ చేసినట్లు పరిశ్రమ యాజమాన్యం వెల్లడించింది. దాదాపు 3.43 లక్షల బస్తాల చక్కెరను ఉత్పత్తి చేశామన్నారు.

By

Published : Apr 26, 2020, 12:46 AM IST

Published : Apr 26, 2020, 12:46 AM IST

ముగిసిన గానుగాటకాలం
ముగిసిన గానుగాటకాలం

విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం 2019-20 సంవత్సరానికి గాను గానుగాటకాలం ముగిసింది. ఇప్పటి వరకు 3.75 లక్షల టన్నుల చెరుకును గానుగ చేసినట్లు పరిశ్రమ యాజమాన్యం వెల్లడించింది. దాదాపు 3.43 లక్షల బస్తాల చక్కెరను ఉత్పత్తి చేశామన్నారు. గతేడాది డిసెంబర్ మెుదటివారంలో గానుగట ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 4.5 లక్షల టన్నుల చెరుకును గానుగాట చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నా... పరిస్థితుల ప్రభావం వల్ల లక్ష్యాన్ని చేరుకోలేక పోయామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details