ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాచలంలో నారసింహ యాగం - visakha

విశాఖలో వెలసిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో సుదర్శన యాగాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు క్రతువు జరగనుంది.

సింహాచలం

By

Published : Mar 9, 2019, 4:13 PM IST

Updated : Mar 10, 2019, 10:49 AM IST

సింహాచలంలో సుదర్శన యాగం
కలియుగ వైకుంఠం విశాఖలో వెలసిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సుదర్శన నారసింహ మహా యాగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 11 నుంచి 20వ తేది వరకు క్రతువును నిర్వహించబోతున్నారు. సింహాచలం గోశాలలోని సువిశాల ప్రాంగణంలో 32 హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక రోజు యాగంలో పాల్గొనే భక్తులకు 5వేల 116 రూపాయలుగా రుసుము నిర్ణయించారు. లోకకల్యాణార్థం.. విశ్వశాంతి కోసం సుదర్శన యాగాన్ని నిర్వహిస్తున్నారు.యాగం సందర్భంగా ఆలయంలో పలు ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు తొలిపూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Last Updated : Mar 10, 2019, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details