ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 14, 2019, 11:51 PM IST

ETV Bharat / state

'ఉల్లి ధరలు తగ్గేంత వరకు సబ్సిడీ అందిస్తాం'

విశాఖ జిల్లా భీమునిపట్నం వ్యవసాయ మార్కెట్​ యార్డులో సబ్సిడీ ఉల్లని ప్రజలకు అందిస్తున్నారు. డిమాండ్​ తగ్గే వరకూ రాయితీ ఉల్లి అందిస్తామని అధికారులు తెలిపారు.

'ఉల్లి ధరలు తగ్గేంత వరకు సబ్సిడీ అందిస్తాం'
'ఉల్లి ధరలు తగ్గేంత వరకు సబ్సిడీ అందిస్తాం'

డిమాండ్​ తగ్గే వరకూ రాయితీ ఉల్లి ఇస్తామంటోన్న అధికారులు

విశాఖ జిల్లా భీమునిపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ప్రభుత్వం సబ్సిడీపై ప్రజలకు ఉల్లిపాయలు అందజేస్తోంది. 13వ తేదీన ప్రారంభమైన సబ్సిడీ ఉల్లిపాయల విక్రయం డిమాండ్ తగ్గేంత వరకు అందజేస్తామని అధికారులు తెలిపారు. శుక్రవారం 13 క్వింటాళ్ల ఉల్లిపాయలు అందజేశామని వ్యవసాయ మార్కెట్​ కమిటీ కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. కిలో ఉల్లిపాయలు సబ్సిడీపై ప్రజలకు రూ.25కే అందజేస్తున్నామన్నారు. ఆధార్, రేషన్ తదితర గుర్తింపు కార్డులు తీసుకొని రావాలన్నారు. నాణ్యమైన ఉల్లిపాయలు ప్రజలకు అందించటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో ఉల్లి ధర ఎక్కువ కావడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేస్తోందని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details