విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని పీఎల్ పురంలోని వివాదాస్పద భూములను నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య పరిశీలించారు. గత కొన్నేళ్లుగా వివాదాల్లో ఉన్న భూములపై తాజాగా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
రెవెన్యూ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. త్వరలోనే నివేదికను అందజేయనున్నట్లు వారు తెలిపారు. భూముల విషయంలో దళితులకు న్యాయం చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్... పరిశీలనకు వచ్చిన అధికారులకు విజ్ఞప్తి చేశారు.