కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య.. నర్సీపట్నం నియోజకవర్గంలోని పలుప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం పీహెచ్సీలతో పాటు నర్సీపట్నంలోని ప్రాంతీయ ఆసుపత్రుల వివరాలు తెలుసుకున్నారు.
ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. వ్యాక్సినేషన్లో సమస్యలు ఆరా తీశారు. వాటిని అధిగమించడానికి సూచనలు ఇచ్చారు. నాతవరం గొలుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరో మూడు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రక్రియకు విఘాతం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.