కరోనా వైరస్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణకు ప్రాధాన్యతనివ్వాలని విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య పేర్కొన్నారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలోని కరోనా రోగులకు అందుతున్న సేవలు, వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాలపై ఆమె పరిశీలన చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 45 ఏళ్లకు పైబడిన వారంతా వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరారు. వచ్చే నెల 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందన్నారు.
కరోనా సేవలు, వ్యాక్సినేషన్ పంపిణీపై సబ్ కలెక్టర్ పరిశీలన - ఈరోజు నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య తాజా వార్తలు
విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య.. ప్రాంతీయ ఆసుపత్రిలోని కరోనా రోగులకు అందుతున్న సేవలు, వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాలను పరిశీలించారు. కరోనా వైరస్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు స్వీయ రక్షణకు ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు.
ఆసుపత్రిలో కొవిడ్ సేవలను పరిశీలించిన సబ్ కలెక్టర్ మౌర్య