విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ పెద్ద బొడ్డేపల్లి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయనున్న కొవిడ్ కేర్ సెంటర్ను సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. సుమారు వందమంది రోగుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికిగానూ ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ శ్రీకారం చుట్టారు. కేర్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. రోగులకు పడకలతో పాటు ఆక్సిజన్ ఇతర సదుపాయాలపై వైద్య సిబ్బందితో సబ్ కలెక్టర్ చర్చించారు.
కొవిడ్ కేర్ సెంటర్ పరిశీలించిన సబ్ కలెక్టర్ - పెద్ద బొడ్డేపల్లి గురుకుల పాఠశాలలో కోవిడ్ కేర్ సెంటర్
విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ పెద్ద బొడ్డేపల్లి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయనున్న కొవిడ్ కేర్ సెంటర్ను సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో ఆయన చర్చించారు.

పెద్ద బొడ్డేపల్లి కోవిడ్ కేర్ సెంటర్ ను పరిశీలించిన సబ్ కలెక్టర్