స్టైరీన్ వాయువు తరలింపు వేగవంతమైంది. ఇప్పటివరకు 14 ట్యాంకర్లలో రసాయనాన్ని నింపి పోర్టుకు తరలించారు. మొత్తం తరలింపునకు మరో మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలోని రసాయనాని పూర్తిగా తరలించాడనికి ఇప్పటికే విశాఖ పోర్టులో ప్రత్యేక నౌక సిద్ధం చేశారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఎల్జీ పరిశ్రమ బృందం ఈ తరలింపు ప్రక్రియను పరిశీలిస్తోంది.
విషవాయువు తరలించేందుకు మరో మూడు రోజులు..! - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు
విశాఖలో ఘోర ప్రమాదానికి కారణమైన స్టైరీన్ వాయువు తరలింపు వేగవంతమైంది. ఎల్జీ పాలిమర్స్ నుంచి ట్యాంకర్ల ద్వారా రోడ్డు మార్గంలో విశాఖ పోర్టుకు తరలిస్తున్నారు.
styrene gas passing to south korea from vishaka