ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్దానంలో అధ్యయనానికి రూ.5 కోట్లు ఇవ్వలేరా? - ఏపీ న్యూస్ అప్​డేట్స్

ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధుల తీవ్రతపై అధ్యయనం చేస్తున్న సంస్థకు నిధుల చెల్లింపులు ఆగిపోయాయి. రూ.5 కోట్లు ఇవ్వడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. దీంతో ఉద్దానంలో అధ్యయనం మందకొడిగా సాగుతోంది. ఇలాగైతే కష్టమేనని జార్జ్‌ సంస్థ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నిధులివ్వకుంటే ఎలాగని ఐసీఎంఆర్‌ ప్రశ్నించింది.

udhanam
udhanam

By

Published : Sep 1, 2021, 9:15 AM IST

ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధుల తీవ్రతపై అధ్యయనం చేస్తున్న సంస్థకు నిధుల చెల్లింపులు ఆగిపోయాయి. రూ.5 కోట్లు ఇవ్వడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. దీంతో ఉద్దానంలో అధ్యయనం మందకొడిగా సాగుతోంది. నిధులు మంజూరు చేయకుంటే... ఎక్కువ రోజులు అధ్యయనాన్ని కొనసాగించలేమని ‘జార్జ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌’ ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. ఇదే విషయాన్ని ఐసీఎంఆర్‌కు తెలియజేసింది. దీంతో ఐసీఎంఆర్‌ డైరెక్టరు జనరల్‌ బలరాం భార్గవ స్వయంగా జోక్యం చేసుకున్నారు. వెంటనే నిధులను కేటాయించి, అధ్యయనం కొనసాగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

ఈ సంస్థ తరఫున ఉద్దానంలో 15 మంది వరకు పని చేస్తున్నారు. వీరిలో పలువురు విధులకు దూరమయ్యారు. నిధుల మంజూరు జరగనందున అధ్యయనాన్ని కొనసాగించేందుకు జార్జ్‌ ఇనిస్టిట్యూట్‌ ఇబ్బందిపడుతోంది. ఈ అధ్యయనం కోసం రూ.5.73 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. జీఎస్టీతో కలిపితే ఈ మొత్తం రూ.6.76 కోట్లు అయింది. ఈ మేరకు జరిగిన ఒప్పందాన్ని అనుసరించి ప్రభుత్వం దశల వారీగా నిధులను మంజూరు చేయాలి. ఇప్పటివరకు రెండు విడతల్లో సుమారు రూ.1.20 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన మొత్తంలో మూడో విడత కింద రూ.2.20 కోట్లు ఎప్పుడో చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు ఇవ్వలేదు.

‘నిధులొస్తాయన్న ఉద్దేశంతో అంతర్గతంగా ఉన్న నిధులను వాడుతూ వస్తున్నాం. ఇలాగే ఎక్కువ కాలం చేయాలంటే సాధ్యం కాదు’ అని జార్జ్‌ సంస్థ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల గురించి అప్పట్లో ఒక్కసారిగా వార్తలు రావడంతో ప్రభుత్వం జార్జ్‌ సంస్థతో ఒప్పందాలు చేసుకుని నిధులను కేటాయించింది. అయితే.. కొనసాగింపుగా నిధులను ఏ ‘హెడ్‌’ నుంచి ఏ పథకం కింద కేటాయించాలన్న దానిపై ఆర్థికశాఖతో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. దీంతో నిధుల విడుదలలో ప్రతిష్టంభన నెలకొంది.

ఇదీ చదవండి: KRMB,GRMB MEETING:నేడు కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details