విద్యాలయాల్లో నైతికతకు సంబంధించిన పాఠాలను బోధిస్తున్నా... సమాజంలో ఆడపిల్లలతోపాటు, మగపిల్లలకూ కట్టుబాట్లను నేర్పించాలని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అలా నేర్పిస్తే దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని విశాఖలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల విద్యార్ధినులు చెప్పారు. అమ్మాయిలను జాగ్రత్తలతో పెంచడం, మంచీచెడూ చెప్పడం లాంటివి ఇంటిదగ్గర నుంచి సమాజం వరకు ఉంటుందని.. అదే సమయంలో అబ్బాయి విషయం వచ్చేసరికి వాటిని సడలింపు చేయడం న్యాయం కాదన్నారు. దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేయడం ఒక సమస్యకు పరిష్కారంగా కాకుండా ఊరటగా మాత్రమే చూడాలని విద్యార్థులు స్పష్టం చేశారు.
దిశ ఎన్ కౌంటర్.. ఊరట మత్రమే! - విశాఖలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల వార్తలు
దిశ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై.. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించింది. ఎన్ కౌంటర్ సమస్యకు పరిష్కారంగా కాకుండా ఊరటగా మాత్రమే చూడాలని విశాఖలోని ఓ కళాశాల విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
ఈటీవీభారత్ విద్యార్థులతో ముఖాముఖీ
TAGGED:
దిశ ఉదాంతం వార్తలు