దళిత మహిళలపై అత్యాచారాలను ఖండిస్తూ విద్యార్థులు ర్యాలీ - Students rally to condemn killings of Dalit women
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్, బలరామ్ పూర్లలో దళిత మహిళలపై జరిగిన హత్యాచారాలను ఖండిస్తూ విశాఖ జిల్లా చోడవరంలో విద్యార్థులు ర్యాలీ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్, బలరామ్ పూర్లలో దళిత మహిళలపై జరిగిన అత్యాచారాలను ఖండిస్తూ చోడవరంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, స్త్రీ విముక్తి సంఘటన నవయువ సమాఖ్యల అధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో బాధితులకు న్యాయం చేయాలని...నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినదించారు. ఇటువంటి సంఘటనలకు దోహదపడుతున్న ఆశ్లీలతను పూర్తిగా తొలగించాలని...అన్యాయంగా వ్యవహరించిన పోలీసులను శిక్షించాలన్నారు. చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ నాలుగు రహదారుల కూడలి వరకు సాగింది.