మావోయిస్టు వారోత్సవాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ర్యాలీ - మన్యంలో మావోల అలజడి వార్తలు
విశాఖ మన్యంలో మావోయిస్టులు తలపెట్టిన గెరిల్లా వారోత్సవాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. 'వారోత్సవాలు వద్దు- అభివృద్ధే ముద్దు' అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.
Students rally in vishaka agenct area against on Mao's activites
By
Published : Dec 8, 2019, 8:23 AM IST
గెరిల్లా వారోత్సవాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ర్యాలీ
విశాఖ ఏజెన్సీ పరిధిలోని చింతపల్లి, గూడెంకొత్తవీధి మండల కేంద్రాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. రహదారులు, సెల్ టవర్ నిర్మాణాలతో పాటు అభివృద్ధి పనులు జరగాలని నినాదాలు చేశారు. మావోలు తలపెట్టిన గెరిల్లా వారోత్సవాలు వద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. నక్సల్స్ చేపట్టే కార్యక్రమాలతో సాధారణ గిరిజనులకు న్యాయం జరగదన్నారు. హింసాత్మక కార్యక్రమాలతో వందలాది గిరిజన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం వాసులు అభివృద్ధి, శాంతిని కోరుకుంటున్నారని తెలిపారు.