విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు గిరిజన గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, యువత.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఫోన్లకు సిగ్నల్ అందక ఆన్లైన్ తరగతులు వినేందుకు రక్షిత మంచినీటి పథకం ట్యాంక్, కొండలు ఎక్కాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తరగతుల నిర్వహణ ఆన్లైన్లోనే జరుగుతుందని.. గ్రామంలో చాలా మంది విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని నర్సింగ్ చదువుతున్న విద్యార్థి దేవి తెలిపింది.
సెల్ సిగ్నల్ లేక.. ఆన్లైన్ తరగతుల కోసం విద్యార్థుల తిప్పలు - valabu latest news
కొవిడ్ కారణంగా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, మొబైల్స్‌కి సిగ్నల్, ఇంటర్నెట్ వంటివి అందుబాటులో లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు గిరిజన పంచాయతీలో ఫోన్లకు సరిగా సిగ్నల్ అందక ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
సెల్ టవర్ ఏర్పాటు చేయాలని విద్యార్థుల నిరసన
సెల్‌ఫోన్ సిగ్నల్ అందుబాటులో లేకపోవటంతో గిరిజన ప్రాంతాల్లోని ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దొర అన్నాడు. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే.. ప్రభుత్వం స్పందించి సెల్ టవర్ ఏర్పాటు చేయాలని కోరాడు.
ఇదీ చదవండి:Mavoist: విశాఖ మన్యంలో కొనసాగుతున్న కూబింగ్..భయం గుప్పిట్లో గిరిజనులు