అడవుల పెంపకంపై..పాడేరులో యూత్ ఫ్లాష్‌మాబ్
విశాఖ ఏజెన్సీ పాడేరు ప్రధాన కూడలి వద్ద ఆకస్మికంగా కొందరు ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. అడవులను కాపాడాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.
విశాఖ ఏజెన్సీ పాడేరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద కొంతమంది యువతీ యువకులు ఫ్లాష్‌మాబ్ చేశారు. రెండు గంటల పాటు డాన్సులు వేస్తూ... స్థానికులను ఉత్సాహపరిచారు. ఈ డాన్స్ చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. పాటల చివర్లో 'సేవ్ ది ఫారెస్ట్ సేవ్ ది లైఫ్' అంటూ బ్యానర్ చూపించారు. రెండు గంటలపాటు వాహనాలు నిలిచి కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ప్రజలు మాత్రం గుమిగూడి ఉత్సాహంగా ఈ నృత్యాన్ని తిలకించారు. ప్రస్తుతం అడవులు అంతరించిపోతున్న దృష్ట్యా యువత ఫ్లాష్‌మాబ్‌తో అడవుల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.