విశాఖ మన్యం పాడేరులో వివిధ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉపకారవేతనం కోసం రోడ్డెక్కారు. విద్యాసంవత్సరం ముగుస్తున్నా.. ఇప్పటివరకూ డబ్బు మంజూరుచేయలేదన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇంటి ఎదుట బైఠాయించారు. ఆమె స్పందించి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్ష ఫీజు చెల్లించలేదని హాల్‌టికెట్లు ఇవ్వడంలేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రిన్సిపల్‌తో తాను మాట్లాడతానని.. అందరూ పరీక్ష రాసేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
ఉపకారవేతనం కోసం విద్యార్థుల ఆందోళన - పాడేరులో విద్యార్థుల ఆందోళన
పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పాడేరులో విద్యార్థులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట బైఠాయించారు. ఉపకారవేతనం రాక తాము ఫీజులు చెల్లించలేదని, యాజమాన్యాలు తమకు పరీక్షలు రాసేందుకు హాల్‌టికెట్ ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యే ఇంటిముందు బైఠాయించిన విద్యార్థులు