సరదాగా నేల బావిలో ఈతకు వెళ్లి.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం - క్రైమ్ వార్తలు
19:09 August 26
STUDENTS DEAD
ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు మూడవ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వచ్చి సరదాకోసం ఈతకు వెళ్లారు. గ్రామ సమీపంలోని నేల బావిలో దిగి ఈత కొడుతుండగా ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిజాలలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గిడిజాలలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఎం. హర్ష శ్రీ సంతోష్(17), కె వెంకట సాయి పవన్ (17) సాయంత్రం స్థానిక సరుగుడు తోటలో ఉన్న ఓ నేల బావిలో ఈత కొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరూ మృతి చెందారు. మూడవ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు సరదాకోసం ఈతకు వెళ్లారని దీంతో ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతులు ఎం.హర్ష శ్రీ సంతోష్ నగరం పెదగంట్యాడ గ్రామంలోని చిన్న నడుపూరు, కె వెంకట సాయి పవన్ కూర్మన్నపాలెంలోని కనితి దగ్గర ఆర్హెచ్ కాలనీ వాసులుగా గుర్తించారు. ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: విశాఖ పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు