ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీకుచింత: విద్యార్థులకు తప్పని తంటా..!

అదో పాఠశాల..! 38 మంది విద్యార్థులు ఉన్నారు..! కనీసం నీడనిచ్చే షెడ్డు కూడా లేదు. ఎండకు ఎండతూ, వానకు తడూస్తూ... చింత చెట్టు కిందే చదువుకుంటున్నారు. భవనం కట్టించమని ఐదేళ్లుగా వేడుకుంటున్నా పట్టించుకున్నవారే లేరని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

చీకుచింత: విద్యార్థులకు తప్పని తంటా..!
చీకుచింత: విద్యార్థులకు తప్పని తంటా..!

By

Published : Mar 22, 2021, 5:24 AM IST

చీకుచింత: విద్యార్థులకు తప్పని తంటా..!

విశాఖ మన్యం ముంచంగిపట్టు మండలంలోని ఓ ఊరు చీకుచింత. ఇక్కడి స్కూల్లో 38 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఊరు పేరులో ఉన్నట్టే... వాళ్లకూ చీకు-చింత తప్పడం లేదు. 2015-16 విద్యా సంవత్సరంలో... కొత్త భవనం కడతామంటూ పాతదాన్ని పడగొట్టారు.

అంతే.. ఆ తర్వాత ఆ మాటే మరిచిపోయారు. అప్పటినుంచీ విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఊరి సమీపంలోని చింతచెట్టు నీడే వారికి దిక్కైంది. ఎండా, వాన, గాలి, చలి... ఇలా అన్నింటినీ భరిస్తూ చదువు కొనసాగిస్తున్నారు.

ఐదారేళ్లుగా పిల్లలు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఉన్నది పడగొట్టి, కొత్త భవనం పేరుతో తాత్సారం చేస్తూనే ఉన్నారని అంటున్నారు. ఇప్పటికైనా కాసింత గూడు కట్టించి, చిన్నారుల చదువులకు ఇబ్బంది లేకుండా చూడాలని వేడుకుంటున్నారు.

వెంటనే స్కూలు భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని... లేదంటే పిల్లలు చదువుకుంటున్న చింత చెట్టు కిందే నిరాహార దీక్ష చేస్తానని సర్పంచ్‌ హెచ్చరిస్తున్నారు. నూతన భవనం కోసం విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపించామని.... నాడు-నేడు రెండో విడతలో అనుమతులు రావొచ్చని సీఆర్పీ చెబుతున్నారు.

ఇదీ చదవండీ... అమ్మాయిలకు ఆ పాత చింతపండు కథలు.. ఇక చెప్పకండి..!

ABOUT THE AUTHOR

...view details