ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మమ్మగారింటికొచ్చాడు.. అర్ధాంతరంగా మరణించాడు.. ఏమైంది? - inter student death

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ ఇంటర్ విద్యార్థి ఈతకెళ్లి మృతి చెందాడు. సరదాగా అమ్మమ్మ ఇంటికి వెళ్లిన యువకుడు మరణ వార్తతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

student went to swimming died in vishaka district
ఇంటర్ విద్యార్థి ఈతకెళ్లి మృతి చెందాడు

By

Published : Jun 16, 2021, 9:34 AM IST

విశాఖ జిల్లాలో ఈత సరదాతో నూతిలోకి దిగిన ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మునగపాక మండలం గంగాదేవి పేటకు చెందిన కాండ్రేగుల గిరీష్ (17).. అనకాపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఊళ్లోని స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు నూతిలోకి దిగాడు. ఈత రాకపోవడంతో సదరు యువకుడు ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారాడు.

చేతికందివచ్చిన బిడ్డ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిర్జీవంగా పడి ఉన్న కుమారుడిని చూసి రోదించిన తీరు కలచివేసింది. గంగాదేవి పేటకు చెందిన జగన్నాథం, లక్ష్మీ లకు గిరీష్ ఒక్కగానొక్క కొడుకే గిరీష్. ఘటనపై కేసు నమోదు చేశామని అనకాపల్లి పట్టణ ఎస్సై రామకృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details