ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య.. - Andhra Pradesh latest news

Student Commits Suicide in RGUKT: తెలంగాణ ఆర్జీయూకేటీలో రెండు నెలల క్రితం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే, మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ అనుబంధ గ్రామం జలాన్మియా పల్లెకు చెందిన పీయూసీ -2 విద్యార్థి పొదిశెట్టి భానుప్రసాద్ బీ1 వసతి గృహంలో ఉంటున్నారు. కాగా ఆయన ఉంటున్న గదిలోనే ఫ్యాన్​కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా వెల్లడైంది. మృతదేహాన్ని పరిశీలించిన ఆర్జీయూకేటీ పోలీసులు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Basara  IIIT
బాసర ట్రిపుల్‌ ఐటీ

By

Published : Dec 19, 2022, 1:55 PM IST

Student Commits Suicide in RGUKT: తెలంగాణలో నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో రెండు నెలల క్రితం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరచిపోక ముందే, మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ అనుబంధ గ్రామం జలాన్మియా పల్లెకు చెందిన పీయూసీ -2 విద్యార్థి పొదిశెట్టి భానుప్రసాద్ బీ1 వసతి గృహంలో ఉంటున్నారు.

కాగా ఆయన ఉంటున్న గదిలోనే ఫ్యాన్​కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆదివారం రాత్రి 10 గంటల అనంతరం వెల్లడైంది. మృతదేహాన్ని పరిశీలిస్తే నాలుక, అరచేతులు నల్లబడి ఉండడాన్ని చూస్తే ఆత్మహత్యకు ఎప్పుడు పాల్పడ్డాడని, దానికి దారితీసిన కారణాలు ఏమిటని తేలాల్సి ఉంది. ఈ విద్యార్థికి చదువులో మేటిగా ఉన్నాడనే పేరుంది. మృతదేహాన్ని పరిశీలించిన ఆర్జీయూకేటీ పోలీసులు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అతని గదిలో నుంచి దుర్వాసన రావడంతోనే ఆత్మహత్య విషయం తెలిసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇదే వాస్తవమైతే అతడు ఒక రోజు ముందే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలకు దారితీస్తుంది. ఈ ఘటన విద్యార్థుల్లో కలకలం సృష్టిస్తుంది. ఇటీవల రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆర్జీయూకేటీని సందర్శించారు. విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

...

తమ తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులను అర్ధం చేసుకుని చదువుపై దృష్టి నిలపాలని హితవు పలికారు. ఉన్నత చదువుల్లో రాణించి ఉద్యోగాలు సాధించాలనే తపనే కాకుండా పది మందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఆకాక్షించారు. ఈ క్రమంలోనే భానుప్రసాద్ బలవన్మరణం సహచర విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుంది. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఆర్జీయూకేటీ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. భానుప్రసాద్​కు తల్లి, చెల్లి ఉన్నారు. తండ్రి పొదిశెట్టి రాములు 4సంవత్సరాల క్రితమే చనిపోయాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details