విశాఖ జిల్లా భీమిలి మండలం నమ్మివానిపేటలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుల కథనం ప్రకారం.. స్నేహితులతో బయటకు వెళ్లిన రమణను తల్లి మారమ్మ, తండ్రి శ్రీను మందలించారు. మనస్థాపానికి గురైన రమణ... తల్లితండ్రులు కూలి పనులకు వెళ్లిన సమయంలో ప్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న భీమిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
చదువుకోకుండా స్నేహితులతో బలాదూర్ గా తిరుగుతున్నాడని తల్లిదండ్రులు మందలించడం వల్లే రమణ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు కూలీ పనుల నుంచి సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి రమణ విగత జీవిగా ఉన్నాడన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.