చిల్లర వర్తకులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని.. వడ్డీ లేని 10 వేల రూపాయల బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ ఫుట్పాత్- తోపుడు బళ్ల కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్తకులు ఆందోళనకు దిగారు. విశాఖ అక్కయపాలెంలో తోపుడు బళ్లు, చిన్న బడ్డీల వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీకి అనుబంధంగా తమ కార్మిక సంఘం ఉందనీ.. తమ సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు.
ఆందోళనకు దిగిన విశాఖ చిల్లర వర్తకులు - విశాఖ వీధి వర్తకులు ఆందోళన వార్తలు
విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో ఫుట్పాత్ - తోపుడు బళ్ల కార్మికులు ఆందోళనకు దిగారు. గుర్తింపు కార్డులు, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆందోళనకు దిగిన విశాఖ చిల్లర వర్తకులు
2014లో కేంద్ర ప్రభుత్వం వీధి విక్రయదారుల చట్టాన్ని చేసినా.. విశాఖ నగరంలో ఆ చట్టం అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లర వ్యాపారులపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వ్యాపారులకు నిత్యావసర సరుకులు సరఫరా చేసి ఆదుకోవాలన్నారు.
ఇదీ చదవండి:సింహాద్రి అప్పన్న ఆలయ ఈవోగా త్రినాథరావు