ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాచుర్యంలోకి రాని రాజా గుహ..ఎక్కడంటే..! - Caves in Visakhapatnam

Raja Caves at Andhra Odisha border visakhapatnam district: విశాఖ జిల్లాలో పర్యాటకంగా గుర్తొచ్చేవి బొర్రా గుహలు..! ప్రాచుర్యంలోకి రాని మరో గుహలు.. ఇప్పుడు వార్తల్లోకెక్కాయి. ఇంతకీ అవి ఎక్కడున్నాయి. ఆ గుహల చరిత్రేంటి..?

Caves in Visakhapatnam
RAJA Caves in Visakhapatnam

By

Published : Jan 17, 2022, 2:34 PM IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో రాజా గుహలు

Raja Caves in Visakhapatnam district విశాఖ జిల్లా హుకుంపేట మండలం పామురాయి నుంచి 3 కిలోమీటర్లు, ఒడిశాలోని ముక్తిమామిడి మధ్యలో ఓ కొండ ఉంటుంది. ఆ కొండ పైభాగాన ఉన్నదే రాజా గుహ. ఈ గుహలోకి వెళ్లడానికి సరైన దారిలేదు. ఔత్సాహికులెవరైనా సాహస ప్రయాణం చేయాల్సిందే. కాలినడకన సుమారు గంట సేపు కొండ ఎక్కితే గుహ కనిపిస్తుంది. 80 మీటర్ల పొడవైన ఈ గుహలో... చాలా చల్లగా ఉంటుంది. పక్షుల కిలకిలారావాలతో వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

పూర్వం మాడుగుల భూపతి రాజులు..ఒడిశా రాజులు వేటకు వచ్చి ఈ గుహలో సేదతీరే వారని స్థానికులు చెప్తున్నారు. దీనికి రాజా గుహగా ఒడిశాలో నామకరణం చేసి ఉంది. కొండ ఎక్కేందుకు మార్గం ఏర్పాటు చేస్తే రాజావారి గుహ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details