విశాఖపట్నం జిల్లాలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ది చేయటానికి చర్యలు తీసుకుంటున్నామని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సీతాలక్షి పేర్కొన్నారు. జిల్లాకు మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణాలకు సంబంధించి ఆమె పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలసి సమీక్ష నిర్వహించారు. నర్సీపట్నం పురపాలక పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి గర్భిణులకు పౌష్టికాహారం అందజేశారు.
జిల్లాలో 4952 అంగన్వాడీ కేంద్రాలుండగా వీటిలో కేవలం 1753 కేంద్రాలకే సొంత భవనాలున్నాయని చెప్పారు. మరో 905 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని తెలిపారు. జిల్లాలో నూరుశాతం సొంత భవనాల్లోనే వీటిని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం ఆయా మండలాల తహసీల్దార్ తో చర్చిస్తున్నామన్నారు.