ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

STEEL PLANT: విశాఖకు వాల్యుయేషన్ కమిటీ..స్టీల్ ప్లాంట్ ముట్టడికి పిలుపు - స్టీల్ ప్లాంట్ ముట్టడి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వస్తున్న వాల్యుయేషన్​ కమిటీని అడ్డుకుని తీరుతామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తెలిపింది. దీనిని నిరసిస్తూ రేపు పరిశ్రమ అన్ని గేట్లను ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జేఏసీ పిలుపునిచ్చింది.

STEEL PLANT
STEEL PLANT

By

Published : Nov 11, 2021, 9:33 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఈ నెల 12న స్టీల్ ప్లాంట్ అన్ని గేట్ల దిగ్బందానికి పిలుపునిచ్చింది. స్టీల్ ప్లాంట్ ఆస్తుల వాల్యుయేషన్ కమిటీ సభ్యులు రాకను నిరసిస్తూ పరిశ్రమ అన్ని గేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జేఏసీ ఛైర్మన్ సీహెచ్ నరసింగరావు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ వాల్యుయేషన్, అడ్వైజర్ కమిటీలను రానివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.

ప్రపంచంలోనే వైజాగ్ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేకస్థానం ఉందని ఆయన అన్నారు. పరిశ్రమ అడ్మిన్ భవనం ముట్టడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. 10 నెలల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఉద్యమం చేసినా.. కేంద్రం తన నిర్ణయాన్ని విషయంలో వెనక్కు తగ్గకుండా అమ్మకానికి కాలు దువ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అన్ని కార్మిక సంఘాలు..రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి స్టీల్ ప్లాంట్​ను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details