ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీలో ఆగస్టు 2, 3న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిరసన - విశాఖ స్టీల్ ప్లాంట్

దిల్లీలో జాతీయ, ప్రాంతీయ పార్టీల ముఖ్య నాయకులను .. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ  నేతలు కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలని..వారిని కోరారు. దిల్లీలో ఆగస్టు 2, 3 తేదీల్లో కార్మికులు  చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

Steel Plant Conservation Committee protest at august in  delhi
దిల్లీలో ఆగస్టు 2, 3న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిరసన

By

Published : Jul 23, 2021, 12:34 PM IST

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్​ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని.. దిల్లీలో జాతీయ, ప్రాంతీయ పార్టీల ముఖ్య నాయకులను స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కలిశారు. ఎంపీ విజయసాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత పవన్​కుమార్ బన్సాల్, సీపీఐ జాతీయ నేత రాజా, సీపీఎం జాతీయ నేతలు సీతారామ్ ఏచూరి, రాఘవులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్​లతో.. జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకుడు అమృత్ కౌర్, సీపీఐ నాయకుడు కన్నయ్య కుమార్ మాట్లాడారు.

దిల్లీలో ఆగస్టు 2, 3 తేదీల్లో కార్మికులు చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని.. స్టీల్ ప్లాంట్​ను ప్రభుత్వంలో కొనసాగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మరో రెండు రోజులు దిల్లీలో ఉండి అనేకమంది ఇతర జాతీయ ప్రాంతీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను నాయకులను కలుస్తామని వారు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details