విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం నుర్మతి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి గర్భం దాల్చింది. రోజూ ఇంటి నుంచే వచ్చే బాలిక... నెల నెల చేసే వైద్య పరీక్షలకు గైర్హాజరయ్యేది. అందుకే ఎవరూ ఈ విషయాన్ని గుర్తించ లేకపోయారు. రెండు రోజు క్రితం ఆమెపై అనుమానం వచ్చిన వసతి గృహ సిబ్బంది వైద్య పరీక్షలు చేస్తే అసలు విషయం వెలుగు చూసింది.
ప్రేమ పేరుతో మోసం... తల్లైన ఆశ్రమ పాఠశాల విద్యార్థి... - undefined
పాడేరు మన్యంలో జిమాడుగులలో నుర్మతి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మైనర్ గర్భం దాల్చింది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పాఠశాల సందర్శించి విచారణ చేపట్టారు.
మైనర్ గర్భంపై ఆరా తీస్తోన్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు
ప్రేమ పేరుతో స్థానిక యువకుడు లోబరచుకున్నాడని... అతన్ని నిలదీస్తే తనకు ఎలాంటి సంబంధం లేదని దబాయించినట్టు బాలిక చెబుతోంది. ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు పాఠశాల సిబ్బంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పాఠశాలకు వచ్చి అరా తీశారు.
ఇదీ చదవండి:100కు ఫోన్ చేస్తే పోలీసులొచ్చి కొట్టారు...!
Last Updated : Dec 26, 2019, 5:08 PM IST