పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 48 వేల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల హృదయాలను గెలుచుకున్నారని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖలో తెలిపారు. రాష్ట్రంలో తెలుగు భాష అమలు తీరు పరిశీలనపై విశాఖ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా తెలుగు భాషను నిర్వీర్యం చేస్తున్నారని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తూ జీవో విడుదల చేయడం హర్షణీయమన్నారు.
' ఇకపై అన్ని బడుల్లో తెలుగు వెలుగుతుంది' - రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యాఖ్యలు
తెలుగులో చంపేస్తున్నారు అని ప్రజల్లో అబద్ధాలు పలుకుతున్న నాయకులు... జీవో మరోసారి స్పష్టంగా చదువుకోవాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సూచించారు.
తెలుగు భాష అమలు తీరుపై అధికారులతో సమావేశం