విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయం కాదని రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రతినిధులు విజయవాడలో నిరసన తెలిపారు. ఉక్కు కార్మికుల రాష్ట్ర బంద్‌కు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం నేతలు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ధర్నా చేశారు. పోరాడి, ఆత్మబలిదానం చేసి సాధించుకున్న పరిశ్రమను యథాతథంగానే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
'విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలి' - vijayawada latest news
విజయవాడ బెంజ్ సర్కిల్లో రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ధర్నా చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకించారు. ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని కోరారు.
విజయవాడ బెంజ్ సర్కిల్లో రాష్ట్ర లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ధర్నా